అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి..

అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంగడి బజార్ లో పాత బస్టాండ్ నుంచి వేస్తున్న సీసీ రోడ్డును ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (చిన్న స్కూల్) వరకు వేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వేస్తున్న సీసీ రోడ్డు మున్సిపల్ మంచి నీటి సంప్ (అవిశెట్టి ముత్యాలు ఇంటి వరకు) వేసి గతంలో వదిలేసిన ముత్యాలమ్మ గుడి (వడ్డెర కాలనీ) రోడ్డుకు లింక్ చేస్తున్నారని, చిన్న స్కూల్ అవతలి వరకు నివాస గృహాలు ఉన్నాయని, చిన్న స్కూల్ ఎదురు గల్లీ సీసీ రోడ్డు మెయిన్ రోడ్డుకు కలపాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్, అధికారులు స్పందించి సీసీ రోడ్డును చిన్న స్కూల్ వరకైనా (సుమారు 50 ఫీట్ల వరకు) పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply