Andhraprabha | పేద ప్రజల పక్షపాతి ఆంధ్రప్రభ

Andhraprabha | పేద ప్రజల పక్షపాతి ఆంధ్రప్రభ

  • సంచనాల కథనాలకు దిక్సూచి ఆంధ్రప్రభ
  • తొర్రూరులో క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Andhraprabha | తొర్రూరు, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు అండగా ఉంటూ సంచల‌న‌ కథానాలకు ఆంధ్రప్రభ దిక్సూచిగా నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రభ 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆంధ్రప్రభ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ లకావత్ యాదగిరి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ… నిరుపేదలకు ఆంధ్రప్రభ అండగా నిలుస్తూ స్వాతంత్రోద్యమ కాలం నుంచి అక్షరాలను అగ్ని కణాలుగా మలిచి ఆంధ్రప్రభ దినపత్రిక సమాజంలోని అన్యాయాలు, అక్రమాలను, అణచివేతలను ఎదురీదిందని తెలిపారు. ప్రజా గొంతుకగా దశాబ్ద కాలం నుంచి పత్రిక(magazine) ప్రస్థానం కొనసాగుతుందని గుర్తు చేశారు. దోపిడిని, అవినీతిని బహిర్గతం చేసి ధైర్యాన్ని నూరిపోసి, పాలకులపై తిరగబడే విధంగా పత్రికా ప్రజలను సమాయత్తం చేసిందన్నారు.

తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన పత్రికల్లో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం ఉందన్నారు. అక్రమ దందాలు, భూ కబ్జాలపై, యువతను పెడదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాలపై వేరవకుండా కథనాలు అందించిన చరిత్ర ఆంధ్రప్రభ(Andhraprabha) కు ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విధివిధానాలు ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రిక పని చేస్తుందన్నారు.1938 నుండి ఆకర్షించే, ఆలోచింపజేసే ఎన్నో కథనాలు అందిస్తూ ప్రజాభిమానాన్ని పొందిందన్నారు. పత్రిక స్వేచ్ఛకు అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య,చాపల అనిత బాపురెడ్డి, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, గంజి విజయపాల్ రెడ్డి, మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష, ఏఎంసి వైస్ చైర్మన్ గుగులోతు బట్టు నాయక్, డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, సర్పంచ్లు రజిని బానోత్, స్వరూప, విద్యాసాగర్, బానోత్ శీను, సావిత్రి, బంగారు రమేష్, గంగా,నాయకులు చిత్తలూరి శ్రీనివాస్, చెవిటి సధాకర్, కందాడి అశోక్ రెడ్డి, పేరటి యాకూబ్ రెడ్డి, జలగం శ్రీనివాస్, తూనం శ్రావణ్ కుమార్, బిక్షం గౌడ్, గజానంద్, దొంగరి రేవతి శంకర్, రాజేష్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, వెలుగు మహేశ్వరి, మనోహర్, మహేష్ యాదవ్, గూడెల్లి రామచంద్రయ్య, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply