Andhraprabha | ఆంధ్రప్రభ కథనానికి స్పంద‌న‌…

Andhraprabha | ఆంధ్రప్రభ కథనానికి స్పంద‌న‌…

  • మరమ్మతులు పూర్తి చేశాం… ఏ ఈ అస్మిత…

Andhraprabha | దండేపల్లి, ఆంధ్రప్రభ : వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పట్టించుకోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అనే ఆంధ్ర‌ప్ర‌భ కథానానికి స్పందించారు. దండేపల్లి మండలంలోని ద్వారక గ్రామ పంచాయతీ లో రోడ్డుపై వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు పైపు లైన్ ద్వారా సప్లై అవుతున్న తాగునీరు వృధాగా పోవడంతో స్పందించిన ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి పైపులైన్ మరమ్మత్తు పనులను ఈ రోజు పూర్తి చేసినట్లు ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ అస్మిత తెలిపారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ…. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయితే తమ దృష్టికి తీసుక వస్తే వెంటనే మరమ్మతు పనులు చేపడతామన్నారు. రోడ్డుపై లీకేజీ అవుతున్న నీటిని పరిశీలించి ఉన్నత అధికారులతో మాట్లాడి వారి సమన్వయంతో మరమ్మతులు పూర్తి చేశామని వివరించారు. ఆమె వెంట ద్వారక పంచాయతీ కార్యదర్శి సతీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply