Ananthapuram | యువత మేలుకో..

Ananthapuram | యువత మేలుకో..

Ananthapuram, ఆంధ్రప్రభ : సమాజంలో సానుకూల మార్పుకు యువతే ప్రధాన శక్తిగా ముందుకు రావాలని.. డా. దాసగానపల్లి కుళ్లాయప్ప పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో యువతతోనే దేశ భవిత అన్న అంశం పై జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి అడుగుపెడితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అప్పుడే పాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ యువతే నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని, ఇంటింటా రాజకీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఓటు వేయడమే సరిపోదని, మార్పుకు దిశానిర్దేశం చేసే నాయకత్వం వహించాల్సిన బాధ్యత యువతదేనని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకాలని, ఆయన భావజాలాన్ని అనుసరించి ముందుకు సాగితేనే దేశ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక.. మార్పు మీ చేతుల్లోనే ఉందని తెలిపారు.

Leave a Reply