చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): జేఎన్‌టీయూ (JNTU) కళాశాల విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరిపించాలని.. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్, టి.రాజేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నియోజవర్గంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని, విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు తప్పా బలమైన కారణం లేకుండా ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నించారు.
విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి (Conduct a thorough investigation) మృతికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. వేధింపుల వల్లే గదిలో ఉరివేసుకున్నట్టు ఆరోపించారు. తక్షణమే అబ్బాయి ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.అర్జున్, బి.శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

