మల్లయ్య హత్య పై విచారణ జరపాలి…

మల్లయ్య హత్య పై విచారణ జరపాలి…
సహకరించిన స్టేషన్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి
కుటుంబాన్ని ఆదుకోవాలి
రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షుడు చందు జనార్ధన్
విజయవాడ, ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లా మండలం లో ఇడుపూరు గ్రామం లో నివాసం ఉండే సంకుల మల్లయ్య ను ఈనెల 20 వతేదీన శుక్రవారం ఉదయం హత్య కాబడ్డారు. ఈ సందర్భం గా ఆదివారం మల్లయ్య కుటుంబాన్ని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ప్రకాశం ఉమ్మడి జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ పరామర్శించారు.దివంగత మల్లయ్య కు సంతాపాన్ని తెలిపి వారికుటుంబానికి చందు జనార్దన్ సానుభూతిని తెలియచేసారు. అనంతరం మార్కాపురం లో జనసేన కార్యాలయం లో మార్కాపురం జిల్లా కాపు సంఘ నాయకులు వంద మంది వరకు సమావేశం అయ్యారు.ఈ సమావేశం లో పాల్గొన ముఖ్య లంత కలసి మూడు ప్రధాన మైన డిమాండ్స్ ను చేశారు.
సంకుల మల్లయ్య హత్య పై సమగ్ర విచారణ జరపాలి. కుట్ర దారులను సంహరించిన వారి పై చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలి. కుట్ర దారులకు సహకరించిన స్టేషన్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి మల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని,లేని పక్షం లో మార్కాపురం లో కానీ లేదా దివంగత మల్లయ్య గ్రామంలో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ సమావేశం లో సుబ్బారాయుడు,ఆకుల గిరిబాబు,బాలకోటయ్య,సంకుల మల్లిఖార్జునరావు, భగవాన్,పసుపులేటి శ్రీనివాసరావు,కంభం వెంకటరమణ రావు,చేబ్రోలు నాగేశ్వర రావు,రాజా రమేష్ బాబు,మేడిద రంగస్వామి,నరసింహారావు,ఎన్ వి సురేష్ బాబు,పెన్నిబోయిన శ్రవణ రావు,పిచ్చయ్య,ఖాసీం,ఇనుప గోళం వెంకటేశ్వర్లు,కాశీ రామ్,ఇమ్మడి శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.
