చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం

చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం

చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ గోషిక వినయ్ కుమార్ ను ఆదివారం చౌటుప్పల్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధ వెంకట్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అర్ధ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వైస్ చైర్మన్ గా వినయ్ కుమార్ ఎన్నిక చౌటుప్పల్ మున్సిపాలిటీకి, ప్రజలకు మరింత అభివృద్ధిని తెచ్చే అవకాశం ఉందని, మున్సిపాలిటీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల కాంగ్రెస్ నాయకులు కంచర్లకుంట రామ్ రెడ్డి, మునుగోడు నియోజక వర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుందే మహేష్, సాయిరాం, శివ, పల్చం సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply