( కుప్పం, ఆంధ్రప్రభ): హంద్రీనీవా జలాలు (Handriniva waters) కుప్పం చేరుకున్న హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు (Krishna Waters) ఆనందంతో కుప్పం నియోజకవర్గ (Kuppam Constituency) ప్రజలకు, రైతులకు అనందం వెల కట్టలేనిదిగా మారింది. నీటి ప్రవాహం కాలువలోకి రాగానే కేరింతలు కొట్టుతూ నాయకులు, ప్రజలు కుప్పం ప్రజల చిరకాల కల నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తమ కుప్పం నియోజకవర్గానికి కృష్ణ జలాభిషేకం చేశారని ప్రజలు హార్షం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాలకు ఘనం స్వాగతం పలకాలనే కుప్పం ప్రజల చిరకాల కల నెరవేరింది. ఆదివారం కుప్పం నేలను కృష్ణాజలాలు ముద్దాడాయి. ఇప్పటివరకు జీవనదులు లేని ప్రాంతంలో కృష్ణా నది నీటితో కుప్పం నేలను తడపడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. సాగునీరు, తాగునీరు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దొరకడంతో ఆనందానికి అవధులు లేవు. దాదాపు 550 కిలో మీటర్ల నుంచి వస్తున్న నీటిని చూసి రైతులు (Farmers) కళ్లలో నీళ్లు తిరిగాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అంటూ తమ ఆనందాన్ని కేరింతలతో పంచుకున్నారు.

ఇక నేడు కుప్పం నియోజక వర్గానికి హంద్రీ నీవా కాలువ ద్వారా నీరు రావడంతో శాంతిపురం మండలం(Shantipuram Mandal) లోని కూటమి నాయకులు కృష్ణానది జలాలు రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. నాలుగు మండల నుంచి కూటమి నాయకులు(Alliance Leaders), ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పరవళ్లుతొక్కుతూ వస్తున్న కృష్ణా జలాలకు జల హారతి సమర్పించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ (MLC Kancharla Srikanth) అమ్మవారికి సారెను సమర్పించారు.

అనంతరం కాలువలో దూకి ప్రజల్తో పాటు నీటిలో కేరింతలు కొట్టారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్ర పటానికి జలాభిషేకం చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం చిత్ర పటంతో ఊరేగింపునిర్వహించారు. భారీగా నీటి ప్రవాహంఉన్న కూడా ప్రజలతో మమేకమై చంద్రబాబు మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనీసం కుప్పం ప్రజలకు ఇలా ఒకరోజు వస్తుందని ఎవరూ కల కూడా కనలేదని ఎవరు ఊహించని విధంగా కుప్పం గురించి చంద్రబాబు ఆలోచిస్తారని అప్పట్లో శ్రీశైలం నుంచి
కుప్పం కి హంద్రీ నీవా కాలువ ద్వారా నీరు తీసుకొస్తా అని ప్రకటిస్తే ఎవరు నమ్మలేదని, ఇక ప్రతిపక్షాలు ఇదంతా పొలిటికల్ గేమ్ అంటూ ఎద్దేవా చేశారని అలాంటి ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు మాత్రం గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లారని ఆ ప్రయత్నమే ఇప్పుడు మన ముందు కృష్ణమ్మ జలాలు పరుగులు కనిపిస్తున్నాయని శ్రీకాంత్ ఎమ్మెల్సీ అన్నారు.

Leave a Reply