America | ట్రంప్ కు కోర్టులో మ‌రో మొట్టికాయ – ట్రాన్స్‌జెండర్లు నిషేధం చెల్ల‌దంటూ తీర్పు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించారు. అలాగే, అమెరికా మిలటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని రద్దు చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగిన విచారణలో ట్రంప్ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. సమానత్వ సూత్రాన్ని ఉదహరిస్తూ ట్రాన్స్‌జెండర్ల‌పై నిషేధాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. రాజ్యాంగంలోని ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడి ఉత్తర్వులకు ఉన్నప్పటికీ, అది సరికాదని స్పష్టం చేసింది. సృష్టిలోని మానవులందరూ సమానమనే అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ట్రంప్ ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అంత‌కు ముందు అమెరికాలో ఇత‌ర దేశ‌స్థులు ప్ర‌స‌విస్తే ఆ బిడ్డ‌కు అమెరికా పౌర‌స‌త్వం రాదంటూ ఇచ్చిన ట్రంప్ ఆదేశాల‌ను సైతం అక్క‌డి కోర్టులు కొట్టివేశాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *