బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
- సీపీఐ ఆధ్వర్యంలో గ్యాస్ బుడ్డిల తో నిరసన
- యుద్ధం కారణంతో గ్యాస్ ధరలు పెంచడం సరికాదు
- సీపీఐ జిల్లా కార్యవర్గం సభ్యులు పోతు రెడ్డి వెంకట్ రెడ్డి
- సీపీఐ మండలకార్యదర్శి బోనగిరి రూపేష్
బెజ్జంకి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణం అని సీపీఐ నాయకులు పోతు రెడ్డి వెంకట్ రెడ్డి, బోనగిరి రూపేష్ మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచడం, గ్యాస్ కొరత పట్ల మండల కేంద్రంలో ప్లకార్డులు, గ్యాస్ సిలెండర్ తో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సిపిఐ మండలకార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణం వల్లే నేడు గ్యాస్ కొరత, ధరల పెంపు జరిగిందన్నారు..
మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని పరిస్థితి చూస్తే తేలిపోతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే గ్యాస్ కొరత కు కారణం అన్నారు. పూర్తిగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యవర్గం సభ్యులు పోతు రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నామంటూ అమెరికా ప్రకటించి భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమానించింది.
గతంలో ఆలీనోద్యమానికి రూపకర్తలమై ప్రపంచ వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారతదేశ విదేశాంగ విధానం ఇప్ప్పుడు అమెరికా కనుసన్నల్లో నడిచే దుస్థితి ఏర్పడడం అత్యంత విచారకరమన్నారు. ఈ కార్యక్రమం లో బెజ్జంకి మండల సిపిఐ సహాయ కార్యదర్శి సంగేం మధు, బెజ్జంకి గ్రామ కార్యదర్శి కల్లూరి భాలమల్లు, ఎ.ఐ.వై.ఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్, గంగుల బాలయ్య, గుండయ్య, చంద్రయ్య, బండి సమ్మియ్య, దుగ్యాని తిరుపతి, ఉల్లీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
