Ambulance | ప్రమాదవశాత్తు…

Ambulance | ప్రమాదవశాత్తు…

Ambulance | ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామానికి చెందిన లాలవ్వ అనే వృద్ధురాలు శుక్రవారం ప్రమాదవశాత్తు నిజాంసాగర్ కెనాల్ లో జారిపడి మృతి చెందింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లాలవ్వ అనే వృద్ధురాలు గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాంసాగర్ కెనాల్ లో బట్టలు ఉతికే క్రమంలో కాలువలో జారిపడింది. గమనించిన స్థానికులు ఆమెను కెనాల్ నుండి వెలికి తీసి అంబులెన్స్ లో బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Leave a Reply