Ambedkar statue | దాతల సహకారం అభినందనీయం

Ambedkar statue | దాతల సహకారం అభినందనీయం
- మాజీ సర్పంచ్ రణధీర్ రెడ్డి
Ambedkar statue | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : దాతల సహకారం అభినందనీయమని రామన్నగూడెం మాజీ సర్పంచ్ రణధీర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మండలంలోని రామన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాని(Ambedkar statue)కి గోల్ తండాకు చెందిన లూనావత్ రాములు నాయక్ రూ.30 వేల(Rs.30 thousand) విలువచేసే ఇనుప మెట్లను బహుకరించారు.
ఈ సందర్భంగా రణధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. గ్రామ దళిత సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ.. మాజీ సర్పంచ్ రణధీర్ రెడ్డి ప్రేరణతో బహుకరించిన లూనావత్ రాములు నాయక్ ను అభినందించారు.
