జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి…

జగ్జీవన్ రామ్ సేవలు ఎనలేనివి…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ సేవలు గొప్పవని చేర్యాల గ్రామ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు జుట్టు శేఖర్ అన్నారు. కంది మండలం చేర్యాల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్, వివేకానంద యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రాజు, ఉపసర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
