వెలగపూడి – రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది.
క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్ , సొల్యూషన్స్ తో పాటు పరిశోధన, హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టీసీఎస్ అందించనుంది. అలాగే వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని అందించేలా టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. క్లైంట్ నెట్‌వర్క్‌తో పాటు స్టార్టప్ , ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతి రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది.