అల్వాల్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేటి ఉదయం వృద్ధ దంపతులు మరణించారు. వారి వంటిపై గాయాలు ఉండటం తో స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులిద్దరి ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా భావిస్తున్నారు పోలీసులు.
మృతి చెందిన దంపతులు కనకయ్య,రాజమ్మ గా గుర్తించారు. కనకయ్య వాచ్ మెన్ గా పనిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు.కర్రలతో కొట్టి హతమార్చిన ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.