March 2 | తరలివచ్చిన తారాలోకం..

March 2 | తరలివచ్చిన తారాలోకం..
March 2 | అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి
ప్రీ వెడ్డింగ్ రెసప్షన్ ఘనంగా నిర్వహణ
అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించిన అల్లు అర్జున్
అయ్యప్ప మాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రామ్ చరణ్
సినీ, రాజకీయ ప్రముఖుల సందడి
మార్చి 6న అంగరంగ వైభవంగా వివాహం
March 2 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్, నయనికా వివాహ వేడుక మార్చి 6న జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. మార్చి 2న ప్రీ వెడ్డింగ్ రెసప్షన్ నిర్వహించారు. అద్భుతమైన వేదిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. శిరిష్, నయనికా జంటగాను ఆశీర్వదించారు.

అల్లు అర్జున్.. సోదుడు శిరీష్ పెళ్లి వేడుక ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాడు. అతిథులను స్వయంగా ఆహ్వానిస్తూ.. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి.. వేడుకలో సందడి చేసాడు. అన్నయ్యగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా దగ్గరుండి ఈ వేడుకకు వచ్చిన వార్ని పలకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అయ్యప్ప మాలలో హాజరైన రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పచ్చు. అలాగే బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సురేష్ బాబు, నాని, సాయిదుర్గ తేజ్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.

సుకుమార్, సందీప్ రెడ్డి వంగ, దర్శకుడు బుచ్చిబాబు, హీరో శ్రీ విష్ణు, కమెడియన్ అలీ ప్రముఖ యాంకర్ సుమ కనకాల కూడా హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు. అయితే.. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మార్చి 6న వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు.

