AP | సైకిలెక్కిన ఆళ్ల నాని !
మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేయగా.. తాజాగా అధిష్టానం నుంచి లైన్ క్లియర్ కావడంతో ఆళ్ల నాని పార్టీ కండువా కప్పుకున్నారు.