విశ్వాసులకు సకల సౌకర్యాల ఏర్పాట్లు..

విశ్వాసులకు సకల సౌకర్యాల ఏర్పాట్లు..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా ఆర్సిఎం పుణ్యక్షేత్రం పీఠాధిపతులు బిషప్ డిడి డాక్టర్ సగిలి ప్రకాష్ సారధ్యంలో కరుణగిరి పుణ్య క్షేత్ర డైరెక్టర్లు రెవరెండ్ ఫాదర్స్ జ్వానేస్, ఆంథోనీ రాజ్, ఖమ్మం జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్, ఫాదర్ కాకమాను రాజు, కొమ్ము ఆంథోనీ, ఎలియాస్, బిషప్ వ్యక్తిగత గురువులతో పాటు, అనుభవ సీనియర్ గురువుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరుణగిరి పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్న విశ్వాసులు, భక్తులకు సకల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని గురువులు తెలిపారు. అదే క్రమంలో జిల్లా జ్యోతిర్మయి డైరెక్టర్ కాకమాను రాజు సూచనలతో జ్యోతిర్మయి ఉజ్జీవకులు ట్రాఫిక్ నిబంధనలతో విజయవంతంగా నిర్వహించడంతో డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రాల వ్యాప్తంగా మొదలుకొని కరుణగిరి మహోత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడం జరిగింది.
బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎక్కువుగా ఉండడంతో వాహనాల ట్రాఫిక్ నియంత్రించి, భక్తులను పూజల్లో పాల్గొనేలా చేయడంతో డైరెక్టర్ ఫాదర్ కాకమాను రాజు అభినందించారు. ప్రముఖ దైవసందేశకులు ఆంధ్రరాష్ట్రం మంగళగిరి నుండి ఫాదర్ జైసన్ డివైస్ వీసీ మెర్సీ రిట్రీట్ గురువు ప్రసంగించారు. విజీ తప్పేటశౌరీ గురువు, విశ్రాంత బిషప్ పాల్ మైపన్ బిషప్ దివ్యబలి పూజను సమర్పించారని, తిరు హృదయ సభ విచారణ గురువులు సిద్దెల జేసు ప్రసాద్, గబ్బెట అరుణ్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంల జ్యోతిర్మయి కోఆర్డినేటర్ శౌరి సుందర్రావు, ప్రసాద్, యేసురాజు, చిన్నప్ప, పాస్కాలి, శాంతయ్య, మోహన్రావు, బాబురావు, దేవానందం, బాలస్వామి, యోహాను, ఆంధ్రప్ప, ఆళ్లపల్లి విచారణ జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్, బ్రదర్స్, సిస్టర్స్, గురువులు తదితరులు పాల్గొన్నారు.
