Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

విశాఖ : బంగాళాఖాతంలో ని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి.

అయితే కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు వెళ్లడం వల్ల 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు..

తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక ఏపీ విషయానికొస్తే.. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి.

Leave a Reply