Aler | బీఫామ్ లు అందజేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Aler | బీఫామ్ లు అందజేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Aler | ఆలేరు, ఆంధ్రప్రభ : ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వార్డుల నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు ఇందిరా కాంగ్రెస్ భవన్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీఫామ్ లు అందజేశారు. మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, వంటేరు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు కే సాగర్ రెడ్డి, గంధమల్ల అశోక్, ఎండి జైనుద్దీన్, బీజని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
