ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఎన్నికల కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. సహాయ ఎన్నికల అధికారి, కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు వలిగొండ ఆంజనేయులు, కె సత్యాంజనేయ ప్రసాద్, సహాయ రిటర్నింగ్ అధికారులు చూడల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply