Aler | ఆలేరు శ్రీరంగ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి

Aler | ఆలేరు శ్రీరంగ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి
- ఉత్తర ద్వార దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి
- భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని అపర వైకుంఠంగా ప్రసిద్ధి పొందిన శ్రీ గోదా లక్ష్మీ సమేత శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం ఐదు గంటలకు ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మహిళలు మంగళ హారతులతో హాజరయ్యారు.

ఉత్తర ద్వారం నుండి శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ రంగనాయక స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగనామస్మరణ మధ్య ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి, వరదరాజు ఆధ్వర్యంలో ధనుర్మాస పాశురాల పఠనం మధ్య ఉత్సవమూర్తులకు విశేష పూజలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గోపిరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
