Alcohol | గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ …

Alcohol | గ్రామాల్లో మద్యం అమ్మితే రూ. లక్ష ఫైన్ …
- పట్టిస్తే రూ.10 వేలు నజరానా…
- మద్యాన్ని నిషేధిస్తున్న కొత్త పాలకవర్గాలు …
Alcohol | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : జనగామ నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో మద్యపానం నిషేధం అమలు పై నూతన పాలవక వర్గం పంచాయతీ లు మహిళా సంఘాల అభిప్రాయం మేరకు గ్రామ సభలో తీర్మానాలు కొనసాగుతున్నాయి. బచ్చన్నపేట మండలంలో ఇటీవల జరుగుతున్న నూతన పాలకవర్గం పంచాయతీల సమావేశాల్లోను మహిళా సంఘాలు యువత ఆదేశాల మేరకు సంపూర్ణ మద్యపానం నిషేధం కు శ్రీకారం చుడుతున్నారు.
ఇప్పటికే గత సర్పంచ్ నుండి మండలంలోని నారాయణ పురం గ్రామం మద్యపాన నిషేధం అమల్లో ఉందన్నారు. ఇటీవల నూతన పాలకవర్గం సైతం గ్రామసభల్లో మహిళా సంఘాల ఆదేశాల మేరకు సంపూర్ణ మద్యపానం నిషేధం అమలకు కంకణం కట్టారు. ఇటీవల జరుగుతున్న గ్రామసభల్లో చిన్న రామన్ చర్ల లో ఫిబ్రవరి 1 నుండి నిషేధం అమల్లోకి తెచ్చారు.
తదుపరి కోడవటూరు గ్రామసభలో ఈనెల జనవరి 26 జెండా ఆవిష్కరణ నుండి సంపూర్ణ మద్యపాన నిషేధంకు గ్రామంలో పార్టీలకు అతీతంగా నాయకులు మహిళలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అదే బాటలో మరికొన్ని గ్రామాల్లో బంద్ కు రెడీ కి సిద్ధమవుతున్నట్లు పాలకమండలి నాయకులు, మహిళా సంఘాల వివోఏలు వెల్లడిస్తున్నారు. నిషేధం గ్రామాల్లో మద్యం అమ్మినవారికి రూ. 1 లక్ష జరిమానా, పట్టించినవారికి రూ. 10 వేలునజరా లెక్కన ప్రకటించారు.
ఇప్పటి వరకు నిషేధం విధించిన గ్రామాలతో పాటు మరికొన్ని పాలకవర్గం పంచాయతీలు సంపూర్ణ మద్యాన్ని నిషేధించేందుకు గాను బండ నాగారం, వీఎస్ఆర్ నగర్ పంచాయతీలు కూడా రెడీ అయ్యాయని తెలుస్తోంది. గ్రామాల్లో కొందరు యువత ఉదయం, సాయంత్రం తాగుతూ మద్యం మత్తులో గొడవలు పడుతున్నారు. దీంతో సర్పంచ్ లు గ్రామాల్లో వివాదాలు రాకుండా కొత్త ఆలోచన చేసి మద్యాన్ని బంద్ చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మరోవైపు మధ్య నిషేధంపై యువకులు మండి పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం మద్యం పంచి, ఇప్పుడు నిషేధిస్తామంటే ఎలా అంటూ కొందరు మద్యం బాబులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల పంచాయతీల తీర్మానం అబిష్టానం మేరకు ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఈ మేరకు పని చేస్తారని విషయంపై పాలకవర్గం గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
కోడవటూరు గ్రామసభలో గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి, ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి, జెడ్పిహెచ్ఎస్ స్వామి, హెచ్ఎం రాజేశ్వరి, అంగన్వాడి టీచర్ ప్రేమ లక్ష్మి, ఏఈఓ అజయ్, శ్యామల, వివో ఏ వాని, శోభ, పంచాయతీ కార్యదర్శి రూప, పీఎస్ రూప ,ఏపీఏ అశోక్, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు…
