కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ..

కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ..
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా పెద్దపల్లి వాసి లైశెట్టి అఖిల్ కృష్ణ ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో 390 మార్కులకు గాను 333 మార్కులు సాధించిన అఖిల్ ఓపెన్ క్యాటగిరిలో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. అఖిల్ ప్రాథమిక విద్య నుండి హై స్కూల్ విద్య వరుకు పెద్దపల్లిలో విద్యను అభ్యసించారు.
హైదరాబాదులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనంతరం చెన్నైలోని వెల్ టెక్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. 2025లో గ్రూప్ ఫోర్ పరీక్షలో ఎన్నికై ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ బిక్షపతి కుమారుడు అఖిల్ కృష్ణ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా ఎంపికవడం పట్ల పెద్దపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
