ajit pawar | సమగ్ర దర్యాప్తు జరపాలి.. సీఎం మమత

ajit pawar | సమగ్ర దర్యాప్తు జరపాలి.. సీఎం మమత
ajit pawar | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) నేత అజిత్ పవార్ ఆకస్మిక మరణం యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా చేసింది. సహచరులతో కలిసి ప్రచారానికి బయలుదేరిన ఆయన ఇవాళ ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. లియర్ జెట్ 45 విమానం (రిజిస్ట్రేషన్ VT-SSK) బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘోర విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మహాయుతి నుండి దూరం జరిగేందుకు యోచిస్తున్నారని, శరద్ పవార్ తో కలవడానికి ప్రయత్నిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరణం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇక్కడ ప్రజలకు ఎలాంటి భద్రత లేదన్నారు. నీ బీజేపీతో ఉండగానే ఇలా జరిగిందని, ఇక ప్రతిపక్ష పార్టీల గతి ఏమిటో అర్థం కాదని ఆమె విచారణ కావాలని డిమాండ్ చేశారు. అజిత్ పవార్, మరో నలుగురు మృతి చెందిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మమతా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
