Airplanes | ఎక్కడంటే…..

Airplanes | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇటీవల కాంలో స్కూళ్లకు, విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నారు. తాజాగా బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన గల్ఫ్ ఎయిర్ లైన్స్ (GF -274) విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. విమానం గాల్లో ఉండగానే ఈమెయిల్ రావడంతో అధికారులు, విమానసిబ్బంది, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయంతో పైలట్ విమానాన్ని రన్ వే పై ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. వెంటనే రన్ వే కు దూరంగా ఉన్న ఐసోలేషన్ బే కి తరలించి తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, ఎయిర్ పోర్ట్ భద్రతా బలగాలు రంగంలోకి దిగి విమానం మొత్తాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో, ప్రయాణికుల లగేజీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్థారించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply