Air India Plane crash | ఆసుపత్రికి చేరుకున్న అమిత్ షా !

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI171) టేకాఫ్ అయిన కొద్ది సేపటికే భయంకర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే అందులో ఒకే ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.

మేట్ డాక్టర్స్ హాస్టల్‌లోకి విమానం కుప్ప‌కూల‌డంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఘటన తీవ్రత దృష్ట్యా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటనే అహ్మదాబాద్ చేరుకున్నారు.

ఆసుపత్రిలో బాధితుల పరామర్శ

ఘటన అనంతరం అమిత్ షా, భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌కి చేరుకుని గాయపడినవారిని పరామర్శించారు. బాధిత కుటుంబాలకు మానసికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉందని హామీ ఇచ్చారు. వారి వెంట కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

Leave a Reply