AIADMK | ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం

AIADMK | ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం
AIADMK | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఇవాళ ఆమె తన నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. శశికళ తన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవార్ మక్కల్ మునేట్ర కజగం’ (AIADMK) అని పేరు పెట్టారు. అలాగే, తన పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ను ఆమె ప్రకటించారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు, దివంగత ఎంజీ రామచంద్రన్ స్మారకార్థం ‘పురుచ్చి తలైవార్’ అనే పదాన్ని పార్టీ పేరులో చేర్చడం విశేషం.
