శాస్త్రీయ కోణంలో వ్యవసాయం చేపట్టాలి

నర్సంపేట, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ): నర్సంపేట (Narsampet) వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (Madhava Reddy) ప్రారంభించారు. రైతులు వ్యవసాయాన్ని శాస్త్రీయ కోణంలో చేపట్టాలని.. ఇలా చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. రైతులు దిగబడి పట్ల అవగాహన కల్పించుకోవాలని, తక్కువ ఎరువులను వాడుతు అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్రీయ కోణంలో వ్యవసాయం చేయాలని రైతుల(Farmers) కు సూచించారు. పంటకు పంటకు మధ్య క్రాప్ హాలిడే చేస్తూ వ్యవసాయని కొనసాగించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,వ్యవసాయ శాఖ అధికారులు సహకార సంఘం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply