Agriculture | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Agriculture | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Agriculture | డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్
Agriculture | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండిస్తున్న ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉండడమే ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
Agriculture | ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా
రైతులు తమ పంటను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని,తూకంలో పారదర్శకత పాటిస్తూ చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుందని అన్నారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మరికొన్ని పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీడీవో అంజలి,మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్,చైర్మన్ రాము గౌడ్,వైస్ చైర్మన్ బొబ్బ సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరోజు రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్లు పోలేపల్లి రజనీకాంత్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేముల విజయకుమార్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కడుదుల రామకృష్ణ, అలువాల శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్,సోషల్ మీడియా ఇన్ఛార్జి చిర్ర సతీష్ గౌడ్, రేఖ అనిల్,దూరు యాకన్న, ఎర్ర రవి తదితరులు ఉన్నారు.
