- చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్
చింతూరు, (ఏఎస్ఆర్ జిల్లా), ఆంధ్రప్రభ: చింతూరు ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రజలు గోదావరి వరదలు (Godavari Floods) పట్ల అప్రమత్తంగా ఉండాలని చింతూరు ఐటీడీఏ (ITDA) పీవో శుభం నోఖ్వాల్ సూచించారు. భద్రాచలం గోదావరి నది వద్ద బుధవారం సాయంత్రం 3 గంటల సమయానికి 27.60 అడుగులు ఉంది. ప్రస్తుతం గోదావరి నెమ్మదిగా తగ్గుతూ అర్ధరాత్రి నుండి గోదావరి పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు (CWC officials) అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చింతూరు శబరి నది వరద కూడా పెరుగుతుంది. ఏజెన్సీ లోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని పీవో ఆదేశించారు.
వరద తీవ్రత, వర్షం తీవ్రతను బట్టి మారవచ్చు. చింతూరు డివిజన్ (Chintur Division) లో ప్రస్తుతం కొండరాజు పేట నుండి టేకులబోర్ రోడ్, చింతూరు నుండి ముకునూరు రోడ్, నిమ్మలగూడెం నుండి కూయుగూరు రోడ్ బ్లాక్ పాయింట్, జల్లి వారి గూడెం వాగు బ్లాక్ పాయింట్, ఉమ్మడివరం టూ అన్నవరం రోడ్ల పై వరద నీరు (flood water) ఉండి బ్లాక్ అయ్యాయి. ప్రజలు అత్యవసరం అనుకుంటే తప్ప మిగిలిన సమయాల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాలన్నారు. అదే విధంగా మరో ఐదు రోజులు (Five days) పాటు వర్ష సూచన కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో సబ్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ లేదా సదరు తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్లను సంప్రదించవలసిందిగా కోరారు.
కంట్రోల్ రూముల వివరాలు….
1) సబ్ కలెక్టర్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్స్
9490026397
8121729228
9701026397
2) కూనవరం కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్
9652814712
3) వీఆర్ పురం కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్
8008100892
4) చింతూరు కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్
9492527695
5) ఏటపక కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నెంబర్
8332085268
చింతూరు ఐటీడీఏ పరిధిలో వరదలకు సంబందించిన వివరాలను కంట్రోల్ రూముల్లో అందించడం జరుగుతుంది.