ఉమ్మడి ఆదిలాబాద్ , ఆంధ్రప్రభ : ఓ బడిపంతులు పట్టపగలే పీకల దాకా తాగి తరగతి గదిలోని టేబుల్(Table) పక్కనే పడిపోయిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ తాగుబోతు టీచర్(teacher) తమకు వద్దని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

కొమురం భీం జిల్లా జైనూరు మండలం సుకుత్ పల్లి(Sukut Pally) ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలకు చెందిన జె.విలాస్ అనే టీచర్ గురువారం పట్టపగలే పీకల దాకా తాగి తరగతి గదిలో టేబుల్ పక్కన పడిపోయారు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు మద్యం మత్తు(alcohol intoxication)లో నిద్రిస్తున్నటీచర్ ను చూసి పిల్లలు బిక్క మొహం వేసి తల్లిదండ్రులకు ఈ విషయం చేరవేశారు.
ఆ తల్లిదండ్రులు(parents) పాఠశాలకు వచ్చి చూడగా, టీచర్ విలాస్ నేలపైనే పడుకున్న ఘటన చూసి విస్తు పోయారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు(ITDA Project) అధికారి కుష్బూ గుప్తా ఆదేశాల మేరకు విచారణ జరిపి ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్(Deputy Director) రమాదేవి తెలిపారు.