మహబూబ్‌నగర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మహబూబ్‌నగర్‌ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత పులి (Leopard) ఎట్టకేలకు చిక్కింది. సోమవారం ఉదయం కొందరు బోనులో చిక్కిన పులిని చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ (Forest) సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. చిరుత పులిని హైద‌రాబాద్‌ జూ (Hyderabad Zoo) పార్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లకేలకు చిరుతపులి (Leopard) చిక్కడంతో జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply