after sankranthi brs | జలపోరుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

after sankranthi brs | జలపోరుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా డప్పుకొట్టి, దండోరా వేసి జలపోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. దశాబ్దాలతరబడి పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ తెలం గాణను ఎండబెట్టేందుకు పన్నిన కుట్రలను పటాపం చలుచేస్తూ కదం తొక్కేందుకు పార్టీ శ్రేణులు నడుం బిగిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిర్మించుకున్న పాలమూరును పడుకోబెట్టి కాళేశ్వరంను కూల్చి కృష్ణా గోదావరి జలాలను ఆంధ్రకు సాగనంపే కుట్రలు ఇక చెల్లవని పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు గ్రామాల వారీగా దండుకట్టి కదనరంగంలోకి దూకేందుకు కాలు దువ్వుతున్నది.

సంక్రాంతి అనంతరం కృష్ణా గోదావరి పరి వాహక జిల్లాల్లో జలపోరుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొం దిస్తున్నది. తెలంగాణ పల్లెలు కరువుతో తల్లడిల్లుతున్నా, పాలమూరు పడావు పడుతున్నా తలాపున పారే కృష్ణా గోదా వరి నది ప్రవాహాన్ని ఆంధ్రకు మళ్లించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలకు ప్రతిఘటనగా ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్ననట్లు ఇటీవల గులాబీ దళపతి కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు ఉద్యమ కార్యాచరణ రూపకల్పనలో బీఆర్ఎస్ నాయకత్వం నిమగ్నమైంది,

రాబోయే మున్సి పోల్ ఎన్నికల్లో నీటి సమస్య ప్రధాన ఏజెండగా రూపు దిద్దుకోనుంది. గోదావరి జలాలను ఆంధ్రకు మళ్లించి కృష్ణా జలాలతో అనుసంధానం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నల్లమల సాగర్ను తెరమీదకు తీసుకువస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తూ వీగిపోయే పిటిషన్ వేసిందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు క్షేత్ర స్థాయి పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు పోరాటాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈమే రకు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించాలని పార్టీ
……పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

click here for more

Leave a Reply