విద్యుత్ సబ్ స్టేషన్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

విద్యుత్ సబ్ స్టేషన్ లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పెడన – ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం పెడన విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉదయం 10 గంటలకు నిర్వహించినట్లు ఏఈ ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని సంఘ సంస్కర్తగా జ్యోతిరావు పూలే అందించిన సేవలను వివరించారు. ఈ వేడుకల్లో నాగేశ్వరరావు సిద్దేశ్వర రావు బేగ్ పామర్తి చందు నారగాని నాగార్జున స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply