పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి…

పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి…
అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మాదిరిగానే పోలీస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడారు. ఇటీవల పోలీసులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారని, ఇటీవల హైదరాబాదులోనూ దాడులు జరిగాయని గుర్తు చేశారు.
గతంలో పెద్దపల్లి లో జంట న్యా యవాదుల హత్య అందరికీ తెలిసిందే నన్నారు. అలాగే ఇటీ వల మహిళా అడ్వకేట్ ను హత్య చేయడం, ఇందూరులో కొందరు గుండాలు అడ్వకేట్ సొంత ఇంటిపై దాడి చేయడం ..ఇలా అనేక చోట్ల దాడులు జరుగు తున్నాయని పేర్కొన్నా రు. ఇలాంటి సమ యంలో బిల్లు తీసుకు రావడం సంతోషమని స్పష్టం చేశారు.
