కుటుంబ సభ్యులకు పరామర్శ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి , బీఆర్ఎస్(BRS) సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ(Satyanarayana) పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K. Chandrasekhar Rao) నివాళులు అర్పించారు.
తన బావ అయిన సత్యనారాయణ మృతి చెందిన విషయం తెలుసుకునే వెంటనే హరీశ్‌రావు ఇంటివద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన అక్క లక్ష్మమ్మ(Lakshmamma)ను కేసీఆర్ ఓదార్చారు.

