ADST | రైలు కిందపడి ఉద్యోగి బలవన్మరణం

ADST | రైలు కిందపడి ఉద్యోగి బలవన్మరణం
ADST | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని బేతనీ కాలనీ సమీపాన రైల్వే ట్రాక్ పై వ్యక్తి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న జిఆర్పి ఎస్ఐ ఎల్ సరస్వతి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఎస్సై సరస్వతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ADST( అసిస్టెంట్ డివిజనల్ సిగ్నల్ ఇంజనీరింగ్) గా విధులు నిర్వహిస్తున్న నెమలికంటి దావీదు (56) గా గుర్తించామన్నారు. శనివారం వేకువజామున ఒంగోలు నుండి బాపట్ల వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ కు ఎదురుగా నిలబడి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. పాల ప్యాకెట్ల కోసం ఇంటిలో నుండి బయటికి వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఏరియా వైద్యశాల శవపరీక్ష గదికి తరలించినట్లు తెలియజేశారు. ఎస్సై సరస్వతి వెంట జి ఆర్ పి కానిస్టేబుల్ సతీష్ సిబ్బంది ఉన్నారు.
