Adluri Laxman Kumar | స్వతంత్ర ఉద్యమ పత్రిక ఆంధ్రప్రభ

Adluri Laxman Kumar | స్వతంత్ర ఉద్యమ పత్రిక ఆంధ్రప్రభ

  • ప్రజలకు ప్రభుత్వం కు వారధిగా
  • మంత్రి లక్ష్మణ్ కుమార్

Adluri Laxman Kumar | ధర్మపురి, ఆంధ్రప్రభ : భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పత్రిక ఆంధ్రప్రభ అని ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రభ పత్రిక కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టి, వికలాంగుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Laxman Kumar) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆంధ్రప్రభ దినపత్రిక 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Adluri Laxman Kumar

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రభ డైలీ పత్రికతో పాటు, యూ ట్యూబ్, వెబ్, ఏవినింగ్ ఎడిషన్ తో ప్రజలకు (People) వార్తలు ఎప్పటికప్పుడు చేరవేస్తుందన్నారు. ఒక వార్త ఆంధ్రప్రభలో వచ్చిందంటే దానిపై ప్రజలకు నమ్మకం ఉందని, వెంటనే ఆ వార్త స్పందనతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. మరిన్ని రంగాల్లో ఆంధ్రప్రభ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, నెరేళ్ల సర్పంచ్ బాల గౌడ్ నాయకులు రఫిక్, రెడ్డవెని సత్యం, కోరుట్ల శ్రీనివాస్, గడ్డి రాజన్న, ఆంధ్రప్రభ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ కొంక వరప్రసాద్, గొల్లపల్లి రిపోర్టర్ గందే వేణు, ధర్మారం రిపోర్టర్ తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply