ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా (Nalgonda District) మిర్యాలగూడ పట్టణం(Miryalaguda Town)లోని స్థానిక సీతారాంపురం వాసవీ భవన్ (Sitarampuram Vasavi Bhavan) సమీపంలో కొలువై ఉన్న అమ్ములు గన్న అమ్మ ఆదిపరాశక్తి కొలిచిన వారికి కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మెల్ మారువత్తూర్ ఆది పరాశక్తి ( Adi Parashakti) అమ్మవారి పూజా మందిరంలో ఆదివారం గంజి వార్పు (Ganji Warpu) వేడుక అత్యంత వైభవంగా జరిగింది

ఈ వేడుకలో సుమారు నాలుగు వందల మంది అమ్మవారి భక్తులు పాల్గొని భక్తి శ్రద్హల తో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు సందర్భంగా అమ్మవారి భక్తులు మాట్లాడుతూ సమస్త లోకాన్ని పరిపాలించే తల్లి, ఆ జగదేకమాత ఆది పరాశక్తి అమ్మవారు,లోకంలో ఉన్న జనులందరినీ ఉద్ధరించడానికి ఈ కలియుగంలో నడయాడే దైవంగా,మానవ రూపంలో బంగారు అడిగళార్ అమ్మ(Adigalar Amma)గా తమిళనాడు(Tamil Nadu) లోని మేల్ మరువత్తూర్లో కొలువై మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు అని. జీవ కోటికి ఎలాంటి కష్టాలు రాకుండా సమస్త ప్రాణులకు ఆహార లోటు లేకుండా కరుణా కటాక్షాలు చూపాలి అని ఆ ఆది పరాశక్తి (Adi Parashakti) అమ్మవారికి గంజి అనబడే అమృతాన్ని సమర్పించే వేడుకను చేస్తున్నాము అని తెలిపారు.

అదే గంజిని ప్రసాదంగా స్వీకరిస్తే మానవ శరీరం(Human Body)లో ఉండే రుగ్మతలు తొలగి పోతాయి అని సంపూర్ణ ఆరోగ్యం (Absolute Health) సిద్ధిస్తుంది అని నమ్మకంతో ఈ గంజి వేడుక చేసుకోవడం జరుగుతుంది.అని తెలిపారు అంతే కాకుండా,తలపై గంజి కుండను పెట్టుకోవడం వలన, శరీరంలో మూలాధార చక్రంలో సర్ప రూపంలో నిద్రాణంలో ఉన్న కుండలిని శక్తి మేల్కొని సహస్రాన్ని చేరుకుంటుంది అని దాని వలన మన శరీరం ఉత్తేజ భరితమవుతుంది,ఆధ్యాత్మిక చైతన్యం కలిగి తమను తాము శక్తీ వంతులు చేసుకుంటూ సమాజంలో పదిమంది కి సహాయం చేసే గుణ గణాలు సిద్ధిస్తాయి అని అందుకే ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం అని తెలిపారు.

సమాజంలో పెరుగుతున్న చెడుని పారద్రోలి మానవాళి లో భక్తి భావం పెరిగి సన్మార్గంలో ప్రజలు, సంతోషంగా ఉండాలి అని, ఇటువంటి వేడుకను మిర్యాలగూడ ఆదిపరాశక్తి వార పూజా మందిరంలో, ప్రతి ఏటా జరుకుంటాము అని తెలిపారు భక్తులు ఇంతటి భారీ సంఖ్యలో విచ్చేసి పూజాది కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత ఆనందం గా ఉంది అని సంతోషం వ్యక్తం చేశారు నిర్వహణ అధికారులు, కమిటీ సభ్యులు, శక్తి కర్నాటి మాధురి,శక్తి మొరిశెట్టి మాధవి, శక్తి బొమ్మపాల ఊర్మిళ,శక్తి గుండా సుజాత, శక్తి మంచుకొండ అనంత లక్ష్మీ కుమారి,శక్తి కొత్త పద్మ,,నిర్వహించగా,శక్తి వెలుగూరి ప్రసాద రావు ,తెలంగాణ,ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శక్తి కళాధర్ జోనల్ అధ్యక్షులు శక్తి గెల్లీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.