Adilabad | రైతులు అధైర్యపడొద్దు…
Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు అమ్మే పత్తి, మొక్కజొన్న పంట ఉత్పత్తి విక్రయాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథరావు(Vishwanath Rao) అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ రోజు చైర్మన్ విశ్వనాథరావు అధ్యక్షతన మార్కెట్ కమిటీ ఐదవ పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ..కపాస్ కిసాన్ ఆప్(Kapas Kisan App)ను డౌన్లోడ్ చేయడంలో రైతులు ఇబ్బంది పడొద్దని, ఏ దైనా వ్యవసాయ శాఖ(Agriculture Department)ను సంప్రదించాలని కోరారు. మొక్కజొన్న, ఇతర పంట ఉత్పత్తులు, విక్రయాల్లో, ఆన్లైన్ విషయాల్లో ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన కోరారు. పత్తి కొనుగోలులో తేమ శాతం దాదాపు 8 నుండి 12 శాతం ఉండాలని రైతులను కోరారు. జైనూర్ సీసీఐ(Jainur CCI) ద్వారా పత్తి కొనుగోలు మొదలైనందున రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు.
రైతులకు అనేక మార్కెట్లను సందర్శించడానికి మా పాలకవర్గం వెళ్లనుందని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు వెంకట్, జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి అస్పాక్ హైమద్, మార్కెట్ కమిటీ పాలకవర్గం డైరెక్టర్లు జాదవ్ లోకేందర్, పంద్ర షెక్కు, మడావి కృష్ణా, ఆత్రం భుజంగరావు, మండడి లింగు, ఆడ రాజు, ఆత్రం లచ్చు, ఆడ నిలబాయి,ఆత్రం విషంరావు, మార్కెట్ సిబ్బంది మధు, బాబులు,దత్తు తదితరులు పాల్గొన్నారు.

