Adilabad | చందా గణేష్ ప్యానెల్ విజయం..!

Adilabad | చందా గణేష్ ప్యానెల్ విజయం..!
Adilabad | ఆంధ్రప్రభ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) బెల్లూరి ఆలయంలో అయ్యప్ప సేవా సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. గురుస్వామి చందా గణేష్ ప్యానెల్ (Chanda Ganesh Panel) మరోసారి ఘనవిజయం సాధించి పట్టు నిలుపుకుంది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గురుస్వామి చందా గణేష్ తన ప్రత్యర్థి పుప్పాల నరేందర్ పై 342 ఓట్ల మెజార్టీతో నూతన అధ్యక్షునిగా విజయం సాధించారు. చందా గణేష్ కు 529 ఓట్లు రాగా, పుప్పాల నరేంద్రకు 187 ఓట్లు వచ్చాయి.
అయ్యప్ప సంఘం ప్రధాన కార్యదర్శి (Ayyappa Sangam General Secretary) గా తిప్పర్తి సత్యం 303 ఓట్ల ఆధిక్యతతో సూర్య నాయక్ పై విజయం సాధించారు. సంయుక్త కార్యదర్శిగా సంకినేని నర్సింగ్, కోశాధికారిగా గౌరు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులుగా లోలం శివకుమార్, కౌడాల మధుకర్ ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి పదవి ప్రమాణ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల అధికారులుగా చిందం దేవదాస్, నూటంకి సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొత్త కార్యవర్గాన్ని సత్కరించి అభినందనలు తెలిపారు.

