Adilabad | దేశ సేవ కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు

ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ఆర్మీలో చేరిన వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన నలువాల ఆకాష్ (23) శిక్ష‌ణ‌లో భాగంగా 20 కిలోమీటర్ల పరుగు సాధనలో కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘ‌ట‌న‌తో కుటుంబంలో అంతులేని శోఖాన్ని మిగిల్చింది. ఆ యువ‌కుడికి దేశ సేవ చేయాల‌న్న కోరిక తీర‌క ముందే అనంత‌లోకాల‌కు వెళ్లిపోయాడు. ఆకాశ మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇచ్చోడ మండల కేంద్రం నుండి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమయాత్ర నిర్వ‌హించారు.

Hot Comments | కేంద్ర నిర్ల‌క్ష్య‌మే పహల్గామ్‌లో ఉగ్ర‌దాడికి కార‌ణం – సీపీఐ నారాయ‌ణ‌

దేశ సేవ చేయాల‌న్న కోరిక తీర‌కుండానే…
బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన ఆకాష్ దేశసేవ చేయాలనే ఆకాంక్షతో ఆర్మీ జవాన్ గా ఎంపికై అస్సాం రెజిమెంటల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. శిక్షణ శిబిరంలో ఉన్న సమయంలో పరుగు సాధనలో పాల్గొని అలసటతో కుప్పకూలాడు. ఆ తర్వాత అక్కడే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా డిహైడ్రేషన్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతదేహం మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకోగానే వేలాదిమంది యువకులు, వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.ఇచ్చోడ మండల కేంద్రం నుండి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమయాత్ర నిర్వ‌హించారు. యువకులు జాతీయ పతాకాలతో మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించి వీర సైనికునికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వగ్రామమైన వర్త మన్నూరు లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహచర జవాన్లు గౌరవ వందనం చేసి వీడ్కోలు పలికారు.

Leave a Reply