ADB | ఎస్సైని బెదిరించిన ఇద్దరిపై కేసు..

జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తన విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, తాగిన మైకంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. చింతపల్లికి చెందిన అలిశెట్టి మహేష్, రాజంపేటకు చెందిన మెంగని శేఖర్… ఆమెకు విధులకు ఆటంకం కలిగించి, నానా బూతులు తిట్టడంతో పాటు బెదిరించారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. మండలంలోని చింతగూడ గ్రామ సమీపాన నలుగురు పేకాట ఆడుతున్నారని సమాచారం… ఎస్సై పేకాటపై దాడికి వెళ్లిన సమయంలో ఈ ఇద్దరు తాగిన మైకంలో ఆమెను అడ్డుకున్నారు. ఈ మేరకు ఎస్సై అనూష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్థానిక ఏఎస్ఐ గోగుర్ల ముత్యం వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పేకాట కేసు…

చింతగూడ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఎస్సై అనూష తన సిబ్బందితో కలిసి దాడి చేసినప్పుడు ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా గుర్తించారు. వారిలో నలుగురు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,600 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనూష తెలిపారు.

Leave a Reply