ADB | వాతావరణ మార్పులకు తట్టుకునే నగర నిర్మాణం

ADB | వాతావరణ మార్పులకు తట్టుకునే నగర నిర్మాణం

ADB | అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి $340 మిలియన్ విడుదల
ఈ నెలాఖరులో మరో $150 మిలియన్ వచ్చే అవకాశం
$340 మిలియన్ విడుదల – అమరావతి అభివృద్ధికి ఊతం
నెలాఖరులో మరో $150 మిలియన్ వచ్చే అవకాశం
వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి భారీ ఆర్థిక సహాయం
మైలురాళ్ల ఆధారంగా నిధుల విడుదల
క్లైమేట్ రిజిలియంట్ సిటీగా అమరావతి రూపకల్పన

ADB | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరావతి రాజధాని తొలి దశ అభివృద్ధి కోసం వరల్డ్ బ్యాంక్ ఇప్పటివరకు 340 మిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆ అంతర్జాతీయ ఆర్థిక సంస్థకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. ఏప్రిల్ నెలాఖరులోగా మరో 130 నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు నిధులు రాష్ట్రానికి అందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.

వరల్డ్ బ్యాంక్‌తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కూడా అమరావతి రాజధాని తొలి దశ అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1,600 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంను ప్రకటించాయి. ఈ రుణాలపై వడ్డీ రేటు సుమారు 8 నుంచి 8.5 శాతం మధ్య ఉండే అవకాశం ఉండగా, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.

అలాగే, నిధుల విడుదల ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, ప్రాజెక్టులో సాధించిన పురోగతి, మైలురాళ్ల ఆధారంగా విడతల వారీగా జరుగుతుందని అధికారులు తెలిపారు. అమరావతి అభివృద్ధిని వాతావరణ మార్పులకు తట్టుకునే విధంగా రూపకల్పన చేయడం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply