ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
- మత్స్యకారుల డిమాండ్
మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం గుంజపడుగు పంప్ హౌస్ వద్ద చేపలు పట్టుకోకుండా అడ్డుకొని చేపలు చనిపోవడానికి కారణమైన ఇరిగేషన్ అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు గురువారం కోరారు. చేపలు పట్టడానికి అనేకమైన నిబంధనలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేపలు పట్టడానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ మాకు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండానే మమ్మల్ని అడ్డుకుంటూ చేపల మృతికి కారణమైన అన్నారం పంప్ హౌస్ ఇరిగేషన్ అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు వీరబోయిన రాజేందర్, సాధుల సదానందం ,సాధుల ఓదెలు, ఉదరి శివ, నూనె చంద్రయ్య, సాదుల తిరుపతి, కందుల శంకర్, సాదుల శ్రీకాంత్, అనవేన సదానందం, దశరథం తదితరులు ఉన్నారు.
