ACP | సమస్యలపై ఆరా
- మార్నింగ్ వాకింగ్‌లో కూలీలతో ఏసీపీ ముచ్చట
ACP | ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం మండలం మచ్చుపేట్ బహుగుళ్ల రోడ్డుకు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న మహిళలతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ముచ్చటించారు. ఆదివారం ఉదయం రామగిరి మండలం నుంచి ముత్తారం మండలం మచ్చుపేట్ బహుగుళ్ల రహదారికి ఎస్ఐలు శ్రీనివాస్ రవికుమార్‌తో వాకింగ్ కు వచ్చిన ఏసీపీ కూలీలతో గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు.

