పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్
అర్హులందరికీ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల కింద అచ్చంపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాలపై పెళ్లిళ్ల సమయంలో పడే ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో ఆనందం నింపుతోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయాల సొంత చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
