Achampet | మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి క‌ట్టుబ‌డి…

Achampet | మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి క‌ట్టుబ‌డి…

Achampet | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీ(Mahendranagar Colony)లో ఉన్న వికలాంగుల భవనంలో ఈ రోజు బోరు వేయించే కార్యక్రమాన్ని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు(Garlapati Srinivasulu) పూజ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, వికలాంగులకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని, భవనంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి(Vishnuvardhan Reddy), కౌన్సిలర్ బాబా, వికలాంగుల సంఘం ప్రతినిధులు కుమార్ పాల్గొని పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply