ACE | విజయ్ సేతుపతి ‘ఏస్’ రిలీజ్ అప్పుడే !

విజయ్ సేతుపతి అప్‌కమింగ్ మూవీ ఏస్. ఆరుముగకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పవర్ ఫుల్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం ‘గ్లింప్స్’ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రుక్మిణి వసంత్, యోగి బాబు, బి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇప్పుడు ప్రకటించారు. ఈ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌తో ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *